Pages

Wednesday, August 1, 2012

దొండపళ్ళ పచ్చడి



మనము దొండకాయ కూర చేసుకున్నప్పుడు కొన్ని సార్లు దొండపళ్ళు వస్తూవుంటాయి, చాలా మంది వాటిని పారేస్తారు.. ఒక సారి ఇలా చేసి చూడండి. 

దొండపళ్ళు : సన్నగా తరుకున్నవి 1 కప్పు 
టమాటాలు : 2 
ఎండుమెరపకాయలు : 5 
పచ్చిమిర్చి : 2 
కరివేపాకు: ఒక రెబ్బ 
మినపప్పు: అర స్పూన్ 
ఇంగువ : చిటికెడు 
మెంతులు : పావు స్పూన్ 
వెళ్ళుల్లి : 1-2 రెబ్బలు 
చింతపండురసం: 1-2 టేబుల్ స్పూన్లు 
నూని: 4 టేబుల్ స్పున్లు 
ఉప్పు: తగినంత 

చేసుకొనే విధానం: 

ముందుగా మూకుడిలో నూనె వేసుకొని అందులో మెరపకాయలు, ఇంగువ, మినపప్పు, మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. 
అందులోనే పచ్చి మిర్చి,టమాటముక్కలు, దొండపళ్ళ ముక్కలు వేసుకొని సన్నటి సెగమీద ఉంచి కాసేపు బాగా మగ్గనివ్వండి. 
తరవాత ఉప్పు, చింతపండురసం వేసి చల్లరాక వెళ్ళుల్లి , వేయించుకొన్న మెరపకాయలు,ఇంగువ వెసి రుబ్బుకోండి. పైన కరివేపాకు, మినపప్పు వేసుకోవాలి . 

అన్నముతో కాని దోసలతో కాని బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో...

3 comments:

Veeru Veeran said...

ఇది నిజం గా కొత్త ఐడియా అండి.. .పండిన వాటిని మా ఇంటిలో మేకలకు వేసే వాళ్ళం ... ఇది ఈ సారి తప్పకుండా ట్రై చెయ్యాలి ... wonderful idea .

Veeru Veeran said...

colour kooda excting gaa vachindi

విశాలి said...

avunandi.. taste kUDa baagunTundi. Thanks.

Post a Comment