Pages

Tuesday, August 28, 2012

మునగాకు పప్పు కూర

మునగాకు పప్పు కూర :

కావలసినవి

మునగాకు : నాలుగు  కప్పులు
కొబ్బరి తురుము : ఒక కప్పు 
కండి పప్పు : రెండు కప్పులు
 మినప పప్పు : ఒక స్పూన్
శెనగ పప్పు : ఒక స్పూన్
ఆవాలు : అర స్పూన్
మెంతులు : పావు స్పూన్
ఇంగువ : చిటికెడు 
పచ్చి మిర్చి : నాలుగు 
కరివేపాకు ; రెండు రాబ్బలు
ఉప్పు: రుచికి తగినంత 
ఎండు మిరపకాయలు : నాలుగు
నూనె : నాలుగు స్పూన్లు 

ముందుగా కందిపప్పు వేయించుకొని (మరీ ఎర్రగా కాకుండా ) మరీ మెత్తగా కాకుండా బద్ద బద్దగా    ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని అందులో సెనగపప్పు, మినప పప్పు, ఆవాలు, మెంతులు , మెరపకాయలు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. అందులో కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని ( రెండు స్పూన్లు) అందులో చిటికెడు పసుపు వేసి, మునగాకు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి (పైన నీళ్ళ కంచం పెట్టుకుంటే బాగా మెత్తబడుతుంది ఆకు) . ఆకు బాగా ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పు, పోపు వేసుకొని తగినంత ఉప్పువేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా అందులో కొబ్బరి తురుము వేసి ముతపెట్టుకొని ఒక నిముషము తరవాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 

ఈ కూరలోకి మాగయి  పెరుగు పచ్చడి, చల్ల మెరపకాయలు నంచుకొని తింటే బాగుంటుంది. 

2 comments:

Veeru Veeran said...

నాకు బాగా ఇష్టమైన కాంబినేషన్ అండి

విశాలి said...

Thanks Veeru Veeran gaaru.

Post a Comment