Pages

Wednesday, August 29, 2012

చింత చిగురు పప్పు




కావలసినవి :
చింత చిగురు : ఒక కప్పు
పెసర పప్పు : రెండు కప్పులు
పచ్చి మిర్చిలు : నాలుగు
ఆవాలు, జీరకర్ర, మెంతులు : ఒక స్పూన్ 
ఇంగువ : చిటికెడు
ఎండు మిరపకాయ : ఒకటి
కరివేపాకు : రెండు రబ్బలు
సన్నగా తరిగిన కొత్తిమీర  : ఒక స్పూన్ 

ముందుగా పెసరపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. తరవాత ఒక బాణలిలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీరకర్ర, మెంతులు, ఎండు మెరపకాయ  వేసి అవి చిటపట లాడాకా  అందులో  ఇంగువ, కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కాస్త నూనె వేసి అందులో చిటికెడు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకొన్న చింత చిగురు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఉప్పు వేసుకొని, ఉడికించిన పెసరపప్పు వేసుకొని కాస్త నీరు పోసుకొని ఇంకొంచం సేపు స్టవ్ మీద ఉంచుకొని చివరిగా వేయించి పెట్టుకొన్న పోపు కూడా కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ . 

Tuesday, August 28, 2012

మునగాకు పప్పు కూర

మునగాకు పప్పు కూర :

కావలసినవి

మునగాకు : నాలుగు  కప్పులు
కొబ్బరి తురుము : ఒక కప్పు 
కండి పప్పు : రెండు కప్పులు
 మినప పప్పు : ఒక స్పూన్
శెనగ పప్పు : ఒక స్పూన్
ఆవాలు : అర స్పూన్
మెంతులు : పావు స్పూన్
ఇంగువ : చిటికెడు 
పచ్చి మిర్చి : నాలుగు 
కరివేపాకు ; రెండు రాబ్బలు
ఉప్పు: రుచికి తగినంత 
ఎండు మిరపకాయలు : నాలుగు
నూనె : నాలుగు స్పూన్లు 

ముందుగా కందిపప్పు వేయించుకొని (మరీ ఎర్రగా కాకుండా ) మరీ మెత్తగా కాకుండా బద్ద బద్దగా    ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని అందులో సెనగపప్పు, మినప పప్పు, ఆవాలు, మెంతులు , మెరపకాయలు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. అందులో కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని ( రెండు స్పూన్లు) అందులో చిటికెడు పసుపు వేసి, మునగాకు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి (పైన నీళ్ళ కంచం పెట్టుకుంటే బాగా మెత్తబడుతుంది ఆకు) . ఆకు బాగా ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పు, పోపు వేసుకొని తగినంత ఉప్పువేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా అందులో కొబ్బరి తురుము వేసి ముతపెట్టుకొని ఒక నిముషము తరవాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 

ఈ కూరలోకి మాగయి  పెరుగు పచ్చడి, చల్ల మెరపకాయలు నంచుకొని తింటే బాగుంటుంది. 

Friday, August 10, 2012

ఓట్స్ వడలు



ఓట్స్ : 1 కప్పు 
సెనపప్పు: 1 కప్పు 
ఉల్లుపాయలు : 1 కప్పు( సన్నగా తరుముకున్నవి) 
పచ్చి మిర్చీలు : 2 - 5 
అల్లం : చిన్న ముక్క 
కొత్తిమీరి : 3 స్పూన్లు ( సన్నగా తరుకున్నవి ) 
నూనె: వేయించడానికి సరిపడ్డా 
ఉప్పు : తగినంత 
పుదీన తురుము : 1 స్పూన్ 

సెనగపప్పు మూడు గంటలు నానపెట్టుకొని రుబ్బుకోవాలి అందులో ఒక పది నిమిషాలు నానబెట్టిన ఓట్స్ మెత్తగా కలుపుకోవాలి. 

అందులో ఉల్లి ముక్కలు, కొత్తిమీరె, పుదీన తురుము, సన్నగా తరుకొన్న పచ్చిమిర్చీ, అల్లం వేసి (కొద్దిగా గట్టిగా)వడలు లా చేసుకొని నూనె లో వేయించుకొంటే వేడి వేడి ఓట్స్ వడలు తయ్యార్.

మొక్కజొన్న వడలు




మొక్కజొన్న గింజలు - 2 కప్పులు ( మొక్కజొన్న కండెల నుండి గింజలు తీసుకొన్నవి)
పచ్చిమిరపకాయలు - 2-4
కొత్తిమీర- 2 టి స్పూన్లు తురుము
కరివేపాకు- 2-4 రెబ్బలు
ఉల్లిపాయలు - 1/4 కప్పు సన్నగా తరుక్కున్నవి
ఉప్పు - రుచికి
నూనె - వేయించడానికి సరిపడ్డా

చేసే విధానం :

* మొక్కజొన్న గింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి.

వడల పిండిలానే గట్టిగా ( కొంచం) వుండేటట్లు చూసుకోవాలి, అందులో ఉల్లి చెక్కు వేసుకొని కలుపుకొని నూనేలో వేయించుకోవాలి. క్రిస్పి గా కావాలనుకొన్నవారు వడ వేసే ముందు బియ్యపిండిలో అద్దుకొని వేసుకోవచ్చు.

అంతే మొక్కజొన్న వడలు తయ్యరు, టమాట సాస్ తో , లేక పుదీన చెట్నితో తింటే బాగుంటాయి .

ఉసిరికాయ పెరుగు పచ్చడి



కావలసిన పదార్ధాలు: 

ఉసిరికాయలు - 
కొత్తిమిరి తురుము - 2 స్పూన్లు 
పచ్చిమిరపకాయలు - 2-4 
ఎండు మిరపకాయలు - 2 
నెయ్యి- 2 స్పూన్లు 
ఆవాలు - పావు స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
పెరుగు - 1- 1 1/2 కప్పులు 

చేసే విధానం : 


ముందు ఉసిరికాయలను చిన్నగా గాట్లు పెట్టుకొని ఒక బాణళిలో వేసి మగ్గపెట్టుకోవాలి. బాగా మగ్గాక అందులో గింజ తీసివేసి, ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

పచ్చిమిరపకాయలు కొత్తిమిరీ కలిపి కచ్చబచ్చాగా నూరుకోవాలి,ఆ ముద్దను ఉసిరికాయల ముద్దకు కలుపుకోవాలి. 

ఆ ముద్దలో కాస్త ఉప్పు కలుపుకొవాలి. తరవాత ఆవాలు, ఎండుమెరపకాయలు, ఇంగువ నెయ్యిలో వేయించి ఈ ముద్దలో వేసి పెరుగులో కలుపుకోవాలి. పైన కొత్తిమీరి జల్లుకొని అన్నములో తింటే చాలా బాగుంటుంది.

Thursday, August 9, 2012

పుదీనా దోశలు




కావాల్సినవి: 

పెసలు - 1 కప్ 
బియ్యము - 1/2 కప్ 
పుదినా - 1 కట్ట (పెద్దది) 
కొత్తిమీర - 1/2 కట్ట 
పచ్చిమిరపకాయలు - 4-6 
ఇంగువ - కొద్దిగా 
జీలకర్ర - 1 చెంచా 
ఉప్పు - రుచికి తగినంత 
వంటసోడా - ఒక చిటికెడు 

చేయు విధానము 


పెసలు, బియ్యము రెండు గంటలు నానబెట్టి అందులో పుదినా ఆకులు, కొత్తిమీర, పచ్చి మిరప కాయలు, ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకొని పక్కనపెట్టుకోవాలి. 

తరవాత అందులో తగినంత ఉప్పు, వంటసోడా, కొద్దిగా జీలకర్ర వేసి కలుపుకొని తవాపై పెసరట్టులా వేసుకోవాలి. దానిపైన ఇష్టమున్నవారు ఉల్లి పాయ చెక్కు, అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకోవచ్చు 

దీనికి కాంబినేషన్ కొబ్బరి చెట్నీ కాని అల్లం చెట్నీ  బాగుంటుంది

Wednesday, August 8, 2012

కోకోనట్ ఫ్రైడ్‌రైస్



కావలసినవి :

అన్నం- 3 కప్పులు 
కొబ్బరి తురుము - 1 కప్పు 
ఉల్లిపాయ -1 
కరివేపాకు - 2 రెమ్మలు 
పసుపు - చిటికెడు 
ఉప్పు - తగినంత 
నూనె - 4 టీ.స్పూ. 
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ స్పూన్లు 

పొడి చేయడానికి : 

ఎండుమిర్చి - 4 
జీలకర్ర - 1/2 టీ స్పూన్లు 
ధనియాలు - 2 టీ స్పూన్లు 
మిరియాలు - 1/2 టీ స్పూన్లు 
నువ్వులు - 2 టీ స్పూన్లు 

అన్నం పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముకోవాలి. బాణలి వేడి చేసి చెంచాడు నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, నువ్వులు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు వేసి కలిపి కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి తడి పోయేవరకు వేయించి తయారుచేసుకున్న మసాలాపొడి రెండు నిమిషాలు వేపి అన్నం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మరో రెండు నిమిషాలు వేయించి వేడిగా సర్వ్ చేయాలి. ఘాటైన కొబ్బరి అన్నం రెడీ.

Friday, August 3, 2012

రవ్వ ఇడ్లి


కావాల్సినవి : 

ఉప్మా రవ్వ - 1 కప్పు
పుల్ల పెరుగు - 1 కప్పు
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత
కొబ్బరి కోరు - రెండు స్పూన్లు
కారట్ - 1 స్పూన్
ఉల్లిపాయలు - 1 /2 కప్పు సన్నగా తరిగినవి
అల్లం - 1 స్పూన్ సన్నగా తరిగినవి
ఆవాలు, పచ్చి శెనగపప్పు : ఒక అర స్పూన్
నూనె : నాలుగు స్పూన్లు


తయారు చేసే విధానము :

ముందుగా బాండలిలో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి వేయించాలి.వేగిన ఉప్మా రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పుల్ల పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి.మామూలుగా తయారు చేసే ఇడ్లి పిండి లాగ తయారు చేసుకోవాలి.అందులో కారట్ తురుము, ఉల్లిపాయలు,కొబ్బరి కోరు, అల్లం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర గంట పాటు నాన పెట్టాలి.

ఇడ్లి పాత్రకి నూనె రాసి, వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడి / టమాటా పచ్చడితో కాని తింటే బావుంటుంది.

Wednesday, August 1, 2012

దొండపళ్ళ పచ్చడి



మనము దొండకాయ కూర చేసుకున్నప్పుడు కొన్ని సార్లు దొండపళ్ళు వస్తూవుంటాయి, చాలా మంది వాటిని పారేస్తారు.. ఒక సారి ఇలా చేసి చూడండి. 

దొండపళ్ళు : సన్నగా తరుకున్నవి 1 కప్పు 
టమాటాలు : 2 
ఎండుమెరపకాయలు : 5 
పచ్చిమిర్చి : 2 
కరివేపాకు: ఒక రెబ్బ 
మినపప్పు: అర స్పూన్ 
ఇంగువ : చిటికెడు 
మెంతులు : పావు స్పూన్ 
వెళ్ళుల్లి : 1-2 రెబ్బలు 
చింతపండురసం: 1-2 టేబుల్ స్పూన్లు 
నూని: 4 టేబుల్ స్పున్లు 
ఉప్పు: తగినంత 

చేసుకొనే విధానం: 

ముందుగా మూకుడిలో నూనె వేసుకొని అందులో మెరపకాయలు, ఇంగువ, మినపప్పు, మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. 
అందులోనే పచ్చి మిర్చి,టమాటముక్కలు, దొండపళ్ళ ముక్కలు వేసుకొని సన్నటి సెగమీద ఉంచి కాసేపు బాగా మగ్గనివ్వండి. 
తరవాత ఉప్పు, చింతపండురసం వేసి చల్లరాక వెళ్ళుల్లి , వేయించుకొన్న మెరపకాయలు,ఇంగువ వెసి రుబ్బుకోండి. పైన కరివేపాకు, మినపప్పు వేసుకోవాలి . 

అన్నముతో కాని దోసలతో కాని బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో...

దొండకాయ శనగల కూర




కావాల్సినవి పదార్ధాలు : 
దొండకాయలు - 1/4 కే.జీ 
శనగలు - అర కప్పు 
ఎండుమిరపకాయలు - 8 
ఉప్పు - తగినంత 
దనియాలు - 1 టి.స్పూను 
పచ్చికొబ్బరి తురుము - అర కప్పు 

చేసే పద్దతి: దొండకాయలను నాలుగు పీసులుగా నిలువు గా కట్ చేసుకోవాలి, 
ఎండుమిరప కాయలు, ఉప్పు, దనియాలు, పచ్చి కోబ్బరి వేసి మిక్సీకి ఆడించుకోవాలి.. 
శనగలను (నానబెట్టినవి)(మొలకెత్తినవైతె ఇంకా మంచిది)ముందుగా ఉప్పువేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.. 

ముందుగా దొండకాయలను ఆవిరికి ఉడికించుకోవాలి. 

పిదప బాణలిలో ఆయిల్ వేసి అందులో పోపు గింజలు వేసి...తరువాత శనగలు వేసి కొద్దిగా వేయించి దొండకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి..అందులోనికి ముందుగా చేసుకొని ఉంచుకున్న కారం ముద్ద వేసి బాగా కలిపి 2 నిముషాల తరువాత స్టవ్ కట్టేసి..పైన కొత్తిమీర చల్లాలి..

కాలి ఫ్లవర్ కాడల పచ్చడి


కావాల్సినవి :

కాలి ఫ్లవర్ కాడలు : ముక్కలు చేసుకొన్నవి ఒక చిన్న కప్పుడు 
2 చిన్న సైజు టమాటాలు 
ఒక స్పూన్ సెనగ పప్పు, మినపప్పు, ధనియాలు, 
2 పచ్చి మిర్చిలు, 2 ఎండు మెరపకాయలు 
కొట్టి మీరి తరిగింది ఒక స్పూన్ 
నుని - 4 స్పూన్ లు. 
చింతపండు రసం : 1 స్పూన్ 

ముందుగా మూకుడులో సెనగపప్పు, మినపప్పు మెరపకాయలు, ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. 
తరవాత అదే మూకుడులో పచ్చి మిర్చి వేయించి అందులో టమాట ముక్కలు, అవి కొద్దిగా వేగాక 
కాలి ఫ్లవర్ కాడలు వేసి కాస్త ఉప్పు వేసి పైన నీళ్ళ కంచం పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలి. 
బాగా మగ్గాక కొద్దిగా చింతపండు రసం వేసుకొని, కొట్టి మీరి తురిము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. 
చల్లారాక ఇవన్ని రుబ్బుకోండి, ఎవరికేనా వెల్లుల్లి ఇష్టపడేవారు 
రెండు లేక మూడు రబ్బల వెల్లుల్లి వేసుకొని రుబ్బుకొని వేడి వేడి అన్నం లో తింటే చాలా బాగుంటుంది.

బొబ్బర్ల దోసలు

కావాల్సినవి : 

బొబ్బర్లు : 1 కప్పు
శెనగపప్పు : 1/2 కప్పు
బియ్యం పిండి : 4 స్పూన్
పచ్చి మిర్చి : 5
అల్లం : ఒక 2 ఇంచులు
కొత్తిమీరి : 1/4 కట్ట
ఉప్పు తగినంత

ఒక రాత్రి బొబ్బర్లు నానపెట్టుకొని అందులోనే శెనగ పప్పు కూడా నానపెట్టుకొని , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీరి, ఉప్పు వేసుకొని , మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇంకో అరగంటలో దోసలు వేసుకుంటాము అనుకున్నప్పుడు బియ్యపుపిండి కలుపుకోవాలి.

దోసలా వెసుకొని పైన ఉల్లి చెక్కు వేసుకొని , కాస్త మిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని చేస్తే బాగుంటాయి. కొద్దిగా కంద అట్లలా ఉంటాయి.

జిలేబి

మైదా - 1 కప్ 
బియ్యప్పిండి - 3 స్పూన్స్ 
చెక్కర (బెల్లం కోరుకొన్నది) - 21/2 కప్ 
సోడ - చిటికెడు 
కేసర్ రంగు---చిటికెడు 
పుల్ల మజ్జిగ--1 కప్ 
నెయ్యి---2 కప్స్(వేయించడానికి) 

ఒక గిన్నెలోమైదా, బియ్యప్పిండి, సోడ, 
పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి. 
ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు చేసుకోవాలి) 

తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి. మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది. తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి. అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది.



తరువాత ఒక గిన్నెలో చెక్కర (బెల్లం) వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 
తరువాత వెడల్పాటి బానలి లో నెయ్యి వేసి, వేడి చేయాలి. తరువాత సాస్ బాటిల్లో తయారు చేసిన మైదా పిండిని వేయాలి.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి. 

ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి. 
ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి అర నిముషం పాటు ఉంచాలి. 
తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబికు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది.

గిన్ని రొట్టి (దిబ్బ రొట్టి )


మినపగుల్లు : ఒక గ్లాస్ 
వరి నూక : రెండు గ్లాస్ లు (లేని పక్షం లో ఉప్పుడు నూక ఉపయోగించుకోవచ్చు ) 
ఉప్పు తగినంతా 
రెండు పచ్చి మిర్చీలు (ఆప్షనల్), ఇంగువ 

పప్పు ఒక ఆరు గంటల పాటు నాన పెట్టుకొని, నూక ఒక గంట ముందు నాన పెట్టుకోవాలి. పిండిలో ఈ నూక కలుపుకొని ఒక నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి. పచ్చి మిర్చి ఇంగువ పిండిలో వేసుకోవాలి. ఒక ఇత్తడి గిన్ని వేడి చేసుకొని అందులో కాస్త నూని వేసుకొని, అది కాస్త వేడి అయ్యాక ఈ చోవి వేసుకొని బాగా కాల్చుకొని తినండి. దీనికి కొత్తావకాయ/తేనె పానకం కాబినేషన్ చాలా బాగుంటుంది.

మజ్జిగట్లు (చల్లట్లు)



కావాల్సినవి :

అటుకులు(/ మరమరాలు) : 1 కప్పు 
బియ్యం : 2 కప్పులు 
మెంతులు : 1 స్పూన్ . 
కొత్తిమీర (సన్నగా తరిగినది) : 1/4 కప్పు 
పచ్చి మిర్చి : 2 
పుల్ల పెరుగు : 1 కప్పు 
ఉప్పు : తగినంత 

ముందుగా బియ్యము, అటుకులు కడిగి, పుల్లటి పెరుగులో నానపెట్టాలి (7-10 గంటలు). తరువాత పచ్చి మిర్చి , కొత్తిమీరె వేసుకొని రుబ్బుకొని ఉప్పుకలుపుకొని ఇంకొద్దిసేపు అలానే ఉంచాలి (కనీసం 4 గంటలు). తరువాత తవా మీద నూనె వేసుకొని ఈ పిండి కొద్దిగా మందంగా వేసుకొని(ఊతప్పం లా) చుట్టు కొద్దిగా నూనె వేసుకొని పైన ఒక కంచం మూతపెట్టుకుని సన్నటి సెగమీద కాల్చుకోవాలి . 

అల్లపచ్చడి / పళ్ళీల పచ్చడి తో తింటే బాగుంటాయి. పైన ఉల్లి చెక్కు వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది .

వెజ్ నూడల్ ఫ్రైడ్ రైస్


కావలసినవి: 

కారట్ - పావు కప్పు
కాబేజీ - పావు కప్పు
కాప్సికం - పావు కప్పు
బేబి కార్న్ - పావు కప్పు
ఉల్లి కాడలు - కట్ చేసినవి - ఒక పావు కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద - 2స్పూన్లు
సోయా సాస్ - రెండు స్పూన్లు
రెడ్ చిల్లి సాస్ - రెండు స్పూన్లు
చిల్లి వెనిగర్ - ఒక స్పూన్

మొదట ఒక గ్లాస్ బియ్యం ఒక స్పూన్ నుని వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి, అలాగే ఒక కప్పు నూడిల్స్ కుడా నునే వేసుకొని ఉడికించుకొని మళ్లీ కాస్త ఒకటి రెండు స్పూన్ల నూని వేసుకొని పక్కన పెట్టుకోండి .
ఒక ముకుడిలో నునే వేసుకొని అందులో ఈ ముక్కలు అన్ని వేసుకొని సగం వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని తరవాత సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని అందులో అన్నం, నూడిల్స్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే వేడిగా ఒక ప్లేట్ లో వేసుకొని తింటే.. చాలా బాగుంటుంది. ట్రై చేసి చేసి చూడండి.

గుత్తి వంకాయ కూర



కావల్సినవి:

వంకాయలు చిన్నవి - అర కిలో
శనగ పప్పు - ఒక కప్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురిమినది - అర కప్
ఎండు మిర్చి - తగినంత
ఆవాలు, జీలకర్ర పోపుకు సరిపోయే అన్ని
పసుపు
ఉప్పు తగినంత
నూనె _ అర కప్పు 


ముందుగా శనగ పప్పు, ధనియాలు, మిరపకాయలు (నూనె లేకుండా) వేయించి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వంకాయలు కడిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగ సిద్ధం చేసుకున్న పొడిని, కొబ్బరి తురుమును కలిపి వంకాయలలో కూర్చాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, వేసుకొని కొంచం వేగిన తర్వాత కూర్చిన వంకాయలు కూడా వేసి మూత పెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ.