కావలసినవి :
చింత చిగురు : ఒక కప్పు
పెసర పప్పు : రెండు కప్పులు
పచ్చి మిర్చిలు : నాలుగు
ఆవాలు, జీరకర్ర, మెంతులు : ఒక స్పూన్
ఇంగువ : చిటికెడు
ఎండు మిరపకాయ : ఒకటి
కరివేపాకు : రెండు రబ్బలు
సన్నగా తరిగిన కొత్తిమీర : ఒక స్పూన్
ముందుగా పెసరపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. తరవాత ఒక బాణలిలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీరకర్ర, మెంతులు, ఎండు మెరపకాయ వేసి అవి చిటపట లాడాకా అందులో ఇంగువ, కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కాస్త నూనె వేసి అందులో చిటికెడు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకొన్న చింత చిగురు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఉప్పు వేసుకొని, ఉడికించిన పెసరపప్పు వేసుకొని కాస్త నీరు పోసుకొని ఇంకొంచం సేపు స్టవ్ మీద ఉంచుకొని చివరిగా వేయించి పెట్టుకొన్న పోపు కూడా కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ .
0 comments:
Post a Comment