Pages

Friday, August 10, 2012

ఉసిరికాయ పెరుగు పచ్చడి



కావలసిన పదార్ధాలు: 

ఉసిరికాయలు - 
కొత్తిమిరి తురుము - 2 స్పూన్లు 
పచ్చిమిరపకాయలు - 2-4 
ఎండు మిరపకాయలు - 2 
నెయ్యి- 2 స్పూన్లు 
ఆవాలు - పావు స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
పెరుగు - 1- 1 1/2 కప్పులు 

చేసే విధానం : 


ముందు ఉసిరికాయలను చిన్నగా గాట్లు పెట్టుకొని ఒక బాణళిలో వేసి మగ్గపెట్టుకోవాలి. బాగా మగ్గాక అందులో గింజ తీసివేసి, ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

పచ్చిమిరపకాయలు కొత్తిమిరీ కలిపి కచ్చబచ్చాగా నూరుకోవాలి,ఆ ముద్దను ఉసిరికాయల ముద్దకు కలుపుకోవాలి. 

ఆ ముద్దలో కాస్త ఉప్పు కలుపుకొవాలి. తరవాత ఆవాలు, ఎండుమెరపకాయలు, ఇంగువ నెయ్యిలో వేయించి ఈ ముద్దలో వేసి పెరుగులో కలుపుకోవాలి. పైన కొత్తిమీరి జల్లుకొని అన్నములో తింటే చాలా బాగుంటుంది.

2 comments:

Veeru Veeran said...

ఇది నాకు కొత్త .. టైం చూసుకొని ట్రై చేస్తాను but without Ghee.... బావుంటుందా మేడం నెయ్యిలేకుండా

విశాలి said...

పెరుగు పచ్చళ్ళలోకి 'నేతి పోపే ' బాగుంటుందండి. థాంక్స్ వీరు గారు!!

Post a Comment