కావలసిన పదార్థాలు :
మొలకెత్తిన పెసలు - 1 కప్పు
టొమేటోలు - 4
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 కట్ట
నూనె, ఉప్పు - తగినంత
జీలకర్ర - 1/2 టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్స్
ఉల్లిపాయలు - 2
క్యారెట్, క్యాప్సికమ్ తరుగు - 1/2 కప్పు
తయారు చేసే విధానం :
ముందుగా మొలకెత్తిన పెసలను ఉడికించి, వడగట్టి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. అందులోనే పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి దొరగా వేయించాలి. వేయించాక అల్లం, వెల్లుల్లి పేస్ట్, టొమేటో ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఉడికించిన పెసల్ని వేసి కలిపి, ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి, చివర్లో కొత్తిమీర చల్లి దించాలి. అంతే ఇది అన్నంలోకైనా, బ్రెడ్ ముక్కల మధ్యలో ఉంచి సాండ్విచ్‌లాగా తినడానికైనా, రోటిలోకైనా బాగుంటుంది.
0 comments:
Post a Comment