కావల్సినవి :
బీన్స్ - పావు కే.జి.
కొబ్బరి తురుము - 1 కప్పు
ఆవాలు - 1/2 త్స్ప్
శెనగపప్పు - 1/2 స్పూన్
మినపప్పు 1/2 స్పూన్
జీలకర్ర 1/2 స్పూన్
ఇంగువ - చిటికెడు
ఎండుమిరపకాయ - 3
కరివేపాకు - 4 రెబ్బలు
నూనె 2-3 స్పూన్లు
ఉప్పు తగినంత
బీన్స్ సన్నగా తరిగి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడాక ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగాక అప్పుడు కొబ్బరి కోరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి, ఆ వేడికే కొబ్బరి ఉడుకుతుంది. కొబ్బరి వేగితే వాసన బాగోదు.
0 comments:
Post a Comment