skip to main |
skip to sidebar
కావాల్సినవి:
పెసలు - 1 కప్
బియ్యము - 1/2 కప్
పుదినా - 1 కట్ట (పెద్దది)
కొత్తిమీర - 1/2 కట్ట
పచ్చిమిరపకాయలు - 4-6
ఇంగువ - కొద్దిగా
జీలకర్ర - 1 చెంచా
ఉప్పు - రుచికి తగినంత
వంటసోడా - ఒక చిటికెడు
చేయు విధానము
పెసలు, బియ్యము రెండు గంటలు నానబెట్టి అందులో పుదినా ఆకులు, కొత్తిమీర, పచ్చి మిరప కాయలు, ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకొని పక్కనపెట్టుకోవాలి.
తరవాత అందులో తగినంత ఉప్పు, వంటసోడా, కొద్దిగా జీలకర్ర వేసి కలుపుకొని తవాపై పెసరట్టులా వేసుకోవాలి. దానిపైన ఇష్టమున్నవారు ఉల్లి పాయ చెక్కు, అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకోవచ్చు
దీనికి కాంబినేషన్ కొబ్బరి చెట్నీ కాని అల్లం చెట్నీ బాగుంటుంది
కావాల్సినవి :
ఉప్మా రవ్వ - 1 కప్పు
పుల్ల పెరుగు - 1 కప్పు
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత
కొబ్బరి కోరు - రెండు స్పూన్లు
కారట్ - 1 స్పూన్
ఉల్లిపాయలు - 1 /2 కప్పు సన్నగా తరిగినవి
అల్లం - 1 స్పూన్ సన్నగా తరిగినవి
ఆవాలు, పచ్చి శెనగపప్పు : ఒక అర స్పూన్
నూనె : నాలుగు స్పూన్లు
తయారు చేసే విధానము :
ముందుగా బాండలిలో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి వేయించాలి.వేగిన ఉప్మా రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పుల్ల పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి.మామూలుగా తయారు చేసే ఇడ్లి పిండి లాగ తయారు చేసుకోవాలి.అందులో కారట్ తురుము, ఉల్లిపాయలు,కొబ్బరి కోరు, అల్లం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర గంట పాటు నాన పెట్టాలి.
ఇడ్లి పాత్రకి నూనె రాసి, వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడి / టమాటా పచ్చడితో కాని తింటే బావుంటుంది.
కావాల్సినవి :
బొబ్బర్లు : 1 కప్పు
శెనగపప్పు : 1/2 కప్పు
బియ్యం పిండి : 4 స్పూన్
పచ్చి మిర్చి : 5
అల్లం : ఒక 2 ఇంచులు
కొత్తిమీరి : 1/4 కట్ట
ఉప్పు తగినంత
ఒక రాత్రి బొబ్బర్లు నానపెట్టుకొని అందులోనే శెనగ పప్పు కూడా నానపెట్టుకొని , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీరి, ఉప్పు వేసుకొని , మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇంకో అరగంటలో దోసలు వేసుకుంటాము అనుకున్నప్పుడు బియ్యపుపిండి కలుపుకోవాలి.
దోసలా వెసుకొని పైన ఉల్లి చెక్కు వేసుకొని , కాస్త మిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని చేస్తే బాగుంటాయి. కొద్దిగా కంద అట్లలా ఉంటాయి.
మినపగుల్లు : ఒక గ్లాస్
వరి నూక : రెండు గ్లాస్ లు (లేని పక్షం లో ఉప్పుడు నూక ఉపయోగించుకోవచ్చు )
ఉప్పు తగినంతా
రెండు పచ్చి మిర్చీలు (ఆప్షనల్), ఇంగువ
పప్పు ఒక ఆరు గంటల పాటు నాన పెట్టుకొని, నూక ఒక గంట ముందు నాన పెట్టుకోవాలి. పిండిలో ఈ నూక కలుపుకొని ఒక నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి. పచ్చి మిర్చి ఇంగువ పిండిలో వేసుకోవాలి. ఒక ఇత్తడి గిన్ని వేడి చేసుకొని అందులో కాస్త నూని వేసుకొని, అది కాస్త వేడి అయ్యాక ఈ చోవి వేసుకొని బాగా కాల్చుకొని తినండి. దీనికి కొత్తావకాయ/తేనె పానకం కాబినేషన్ చాలా బాగుంటుంది.
కావాల్సినవి :
అటుకులు(/ మరమరాలు) : 1 కప్పు
బియ్యం : 2 కప్పులు
మెంతులు : 1 స్పూన్ .
కొత్తిమీర (సన్నగా తరిగినది) : 1/4 కప్పు
పచ్చి మిర్చి : 2
పుల్ల పెరుగు : 1 కప్పు
ఉప్పు : తగినంత
ముందుగా బియ్యము, అటుకులు కడిగి, పుల్లటి పెరుగులో నానపెట్టాలి (7-10 గంటలు). తరువాత పచ్చి మిర్చి , కొత్తిమీరె వేసుకొని రుబ్బుకొని ఉప్పుకలుపుకొని ఇంకొద్దిసేపు అలానే ఉంచాలి (కనీసం 4 గంటలు). తరువాత తవా మీద నూనె వేసుకొని ఈ పిండి కొద్దిగా మందంగా వేసుకొని(ఊతప్పం లా) చుట్టు కొద్దిగా నూనె వేసుకొని పైన ఒక కంచం మూతపెట్టుకుని సన్నటి సెగమీద కాల్చుకోవాలి .
అల్లపచ్చడి / పళ్ళీల పచ్చడి తో తింటే బాగుంటాయి. పైన ఉల్లి చెక్కు వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది .
కావల్సినవి :
రెండు కప్పుల మినపగుళ్ళు
నాలుగు కప్పుల వరి నూక
ఉప్పు తగినంత
మినపగుళ్ళు ఒక ఆరుగంటల పాటు నానపెట్టుకొని మెత్తగా రుబ్బుకొని నాన పెట్టిన వరినూక, ఉప్పు(కావల్సిన వారు పచ్చి మిర్చి అల్లం ముక్కలు వేసుకోవచ్చు) కలుపుకొని ఒక ఆరు గంటల పాటు నాన నివ్వాలి
పనసాకులు ఒక బుట్టగా కుట్టుకొని అందులో ఈ పిండి పోసుకొని పెద్ద గిన్నెలో నీరు పోసుకొని అందులో ఒక ప్లేట్లో వీటిని ఆవిరిపెట్టాలి. ఒక పది నిమిషాల తరవాత బాగా ఉడికిన కొట్టక్క బుట్టలు రెడి. వీటిని ఆవకాయతో కాని శెనగ పచ్చడితో కాని తింటే బాగుంటుంది.
కావల్సినవి :
అటుకులు--3 కప్స్
ఉల్లిపాయ--1
టమొటా--1
అల్లం--చిన్న ముక్క
పచ్చి మిర్చి--3 లేక 5
నూనె--1 స్పూన్
నెయ్యి--1 స్పూన్
కరివేపాకు--1 రెమ్మ
కొత్తిమీర--2 రెమ్మలు
పసుపు--1/2 స్పూన్
శనగ పప్పు, మినపప్పు ,జీలకర్ర,ఆవాలు - 1 స్పూన్
విధానము:
1.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.
2.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, పోపు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి.
3.తరువాత పసుపు, కరివేపాకు వేయాలి.తగినంత ఉప్పు వేయాలి.
4.అటుకులు నీళ్ళలో కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి, పక్కన పెట్టుకోవాలి.
6.తరువాత వేయించిన ఉల్లిపాయ మిశ్రమము లో గట్టిగా పిండి, పక్కన పెట్టుకున్న అటుకులను వేసి బాగా కలిపి 2 నిముషాలు మూత పెట్టాలి.
అంతే ముగ్గురికి సరిపడ అటుకులుప్మా తయారు.
పైన కొత్తిమీర వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. కొందరు ఈ ఉప్మాలో ఉడికించిన ఆలు, బీన్స్, బఠానీలు , కారట్టు ముక్కలు వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది.