Pages

Friday, November 30, 2012

అరటిపువ్వు పప్పు కూర



కావల్సినవి: 

అరటిపువ్వు : ఒకటి
కంది పప్పు : ఒక కప్పు
శనగ పప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
ఆవాలు : చిటికెడు
కరివేపాకు : ఒక రబ్బ
పచ్చి మిర్చి : రెండు 


ముందుగా అరటిపువ్వును వెన్నులు తీసుకొని సన్నగా తరుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పు ఎర్రగా వేయించుకొని అందులో నీరుపోసి బద్ద బద్దగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ శనగ పప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక అందులో పచిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇంగువ వేసుకొని అందులో ఈ అరటి పువ్వు తురుమును వేసి నీళ్ళ కంచము మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ( పోపు మెత్తబడకూడదనుకునే వారు పొపు తీసి పక్కన పెట్టుకొని చివర్లో కలుపుకోవచ్చు). అరటిపువ్వు ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పును వేసుకొని (కాస్త ఉప్పు కావలంటే వేసుకోవచ్చు)కలుపుకొని రెండు నిమిషాలు  స్టవ్ మీద ఉంచి దింపేసేయండి. అంతే అరటిపువ్వు పప్పు కూర తయ్యారు. అందులో చల్ల మెరపకాయాలు నచుకొని తింటే బాగుంటుంది.  

Sunday, November 18, 2012

చనా గోబీ ఫ్రై



కావల్సినవి: 

గోబి ముక్కలు : ఒక కప్పు 
కాబూలీ చన : ఒక కప్పు 
జీర : ఒక స్పూన్ 
పచ్చి మిర్చీలు : 3-4 
ఉల్లిపాయలు: 2-3 
కరివేపాకు : రెండు రబ్బలు 
జీర పొడి : ఒక స్పూన్ 
నిమ్మరసం : 2-3 స్పూన్లు 
కొత్తి మీరి తురుము : ఒక స్పూన్ 

విధానం :

ముందుగా కాబూలి చన ఆరు గంటలు పసుపు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. నానిన చన ఉడికించుకొని పక్కనపెట్టుకోండి. కాళీఫవర్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో జీర వేసుకొని అది వేగాక అందులో పచి మిర్చి, కరివేపాకు వేసుకొని అది కాస్త వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి వేగుతూ ఉండగా అందులొ చిటికెడు పసుపు వేసుకొని అది బాగా వేగాక అందులో ముందుగా ఉడికించుకొన్న చన, కాలీఫవర్ ముక్కలు వేసుకొని అందులో ఉప్పు, జీర పొడి వేసుకొని ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకొని పైన కొత్తిమీరి తురుము వేసుకొని కలుపుకోవాలి. అంతే గోబీ చన మసాల రెడీ.

శనగల పాటోళీ



కావలసిన వస్తువులు

శనగలు -2 కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిర్చి-4- 6(కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని మిర్చి వేసుకోవచ్చు)
ఉల్లిపాయ - 2 పెద్దవి
ఎండు మిరపకాయలు - 2
శనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - ఒక కప్పు

తయారుచేసే విధానం:

ముందుగా శనగలు ఆరుగంటలు నానపెట్టుకోవాలి, నానిన శనగలతో పాటు ఒక చిన్న అల్లం ముక్క,పచ్చి మిరపకాయలు వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బాణలీలో కొంచెం నూనే వేసుకుని అందులో ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలపేస్ట్ ని వేసి సన్నటి సెగ మీద వుడికించుకోవాలి. మద్య మద్యలో కలుపుతూ బాణలీ అడుగున అంటుకోకుండా కొంచెం పొడిగా అయ్యేవరకు చూసుకోవాలి. అంతే, వేడి వేడి పాటోళీ రెడి, దీనికి మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్.

అలాగే 
నగపప్పుతో కూడా చేశుకోవచ్చు. నగపప్పు ఒక గంట నానితే చాలు.

మెంతాకు పప్పు



కావాల్సినవి: 

మెంతాకు : 1 కట్ట 
ఉల్లిపాయ : 1 (మీడియం) 
కందిపప్పు : 1 కప్పు 
ఆవాలు, జీరకర్ర ,మెంతులు : పోపుకి కావాల్సినవి. 
కరవేపాకు : 1 రబ్బ 
చింతపండు రసం : 3- 5 చంచాలు 
వెల్లుల్లి రెబ్బలు : 4 
ఉప్పు : తగినంత. 

చేసే విధానము: 

ముందుగా పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి . 
ఒక గిన్నెలో కొద్దిగా నూనే వేసుకొని అందులో ఆవాలు, జీరకర్ర, మెంతులు వేసుకొని అవి వేగాక అందులో సన్నగా తరుకున్న ఉల్లిపాయలు వేయించుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు వెసుకొని వెగాక 
అందులో కరవేపాకు, పచ్చి మిర్చి వేసుకొని, కొద్దిగా పసుపు (చిటికెడు) వేసి తరువాత అందులో సన్నగా తరిగిన మెంతాకు వేసుకొని అది వేగాక ఉడికించుకొన్న పప్పు వేసి, కొద్దిగా చింతపండు రసం వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. 

ఇది అన్నము, రోటీలలో కూడా బాగుంటుంది.

ఆలు బఠానీ బోండాలు


కావలసినవి :

ఆలు : రెండు
బఠానీలు (పచ్చివి) : అర కప్పు ( సగం గుప్పెడు )
ఉల్లిపాయలు : 1 (మీడియం)
కొత్తిమీరి , పుదీన : 1-2 స్పూన్ల తురుము.
సెనగపిండి : 4 స్పూన్లు .
ఉప్పు : రుచికి
పచ్చిమిర్చి : 2 ( సన్నగా తరుకోండి)

నూనె: వేయించడానికి కావల్సినంత.

చేసే విధానం :

ముందుగా ఆలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో ఈ ఉడికించిన ఆలు ముద్ద చేసుకొని, అందులో సెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు,ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి, పుదీన, కొత్తిమీర, సెనగపిండి అన్నీ వెసుకొని గట్టిగా కలుపుకోవాలి.

ఆ పిండిని చిన్న చిన్నగా ఉండలు చేసుకొని సన్నటి నూనె సెగలో వేయించుకోవాలి. టమాటా సాస్ తో తింటే బావుంటాయి.

చిక్కుడు కాయ ఉల్లికారం



కావలసినవి : 

చిక్కుడు కాయలు : పావు కిలో 
ఉల్లిపాయలు : 2-3 పెద్దవి 
అల్లము, వెల్లుల్లి ముద్ద : ఒక స్పూన్ 
నూనె : చిన్న కప్పు 
జీరకర్ర : 1/2 టీస్పూన్ 
ఉప్పు: తగినంత 
ధనియాలు : 1/2 స్పూన్లు 
ఎండుకారం: అర స్పూన్ 
పసుపు :చిటికెడు 

చేసే విధానము : 

చిక్కుడు కాయలు చిన్న చిన్న ముక్కలు(ఒక ఇంచ్) గా చేసుకోవాలి. ఉల్లిపాయలు, ధనియాలు, జీరకర్ర, ఎండుమెరపకాయలు, వెల్లుల్లి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో జీరకర్ర వేసి తరవాత కాస్త పసుపు వేసుకొని ఆ తరవాత అల్లము వెల్లుల్లి పేస్ట్ వేగాక ముందుగా చేసుకొని ఉంచుకున్న ఉల్లి ముద్ద వేసుకొని కాస్త వేగాక అందులో కాస్త ఉప్పు, ఇంకొంచం కారం వేసుకొని ఆ తరవాత చికుడు ముక్కలు వేసుకొని కాస్త నీరు పోసుకొని నీళ్ళ కంచం బాణలి మీద పెట్టుకొని సన్నని సన మీద ఉడికించుకోవాలి. ఒక పది నిమిషాల తరవాత ఘుమఘుమలాడే చిక్కుడు ఉల్లికారం రెడీ..