Ads 468x60px

Pages

Featured Posts

Monday, August 26, 2019

అరటి పువ్వు పకోడీ























కావలసినవి :

అరటిపువ్వు: లేతది 1సెనగ పిండి: 1 ½ కప్పుబియ్యం పిండి: అరకప్పు కంటే కొద్దిగా తక్కువఉప్పు తగినంతపసుపు : ¼ స్పూన్
పచ్చిమిరపకాయలు : 5 (మీ కారానికి సరిపడేంత)అల్లం : 1 ఇంచ్ధనియాలు : 3/4 స్పూన్సౌంఫ్ : ½ స్పూన్ (optional)
జీలకర్ర : ¼ స్పూన్నూనె : పకోడీ వేయించడానికి


విధానం :



అరటి పువ్వుని మధ్యలో కాడలు (దొంగలు) తీసి నీళ్ళలో ఉప్పు వేసుకొని ఒకసారి కడిగి పక్కనపెట్టుకోండి.  ఒక వెడల్పాటి గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, పసుపు వేసి కలుపుకోండి.  అల్లం పచ్చిమిరపకాయ మిక్సిలో వేసుకొని ముద్ద చేసుకొని అది పిండిలో కలుపుకోండి.  అలానే ధనియాలు, సౌంఫ్, జీలకర్ర మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోండి అది కూడా పిండిలో వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కడిగిపెట్టుకున్న అరటి పువ్వుని,  3స్పూనుల వేడి నూనెని వేసుకొని కలపండి. ఇప్పుడు నీళ్ళు చిలకరిస్తూ జాగ్రత్తగా గట్టిగ ఉల్లిపాయ పకోడికి మల్లె కలుపుకోండి. (ఈ పకోడీ మిశ్రమం కి ఎక్కువ నీరు పట్టదు).పెద్ద మూకుడులో నూనె వేడి చేసుకొని చెయ్యి కొద్దిగా తడి చేసుకుంటు చిన్న చిన్న పకోడీలు వేసి వేయించుకోండి. 


Tip :  సోయ కూరా నచ్చేవాళ్ళు ఒక కట్ట సన్నగా తరిగి ఈ పకోడీ మిశ్రమంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. 


ఆపిల్ పచ్చడి ముక్కలు



కావలసినవి :

గ్రీన్ ఆపిల్ : 2ఆవపొడి :  2 స్పూన్స్కారం పొడి :  2 పెద్ద స్పూన్స్ఉప్పు తగినంతమెంతి గుండ :  ½ స్పూన్నూనె : 5 స్పూన్స్పసుపు :  ¼ స్పూన్పోపుకి :  ఆవాలు, ఇంగువ


విధానం:

ఆపిల్స్ని  చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.  అవి ఒక గిన్నెలో వేసుకొని, పసుపు, ఉప్పు,ఆవ పొడి వేసి కలుపుకోండి. ఒక చిన్న మూకుడు లో 5 స్పూన్స్ నూనె  వేసి వేడి అయిన తరువాత అందులోకి ఆవాలు, ఇంగువ  వేయండి.  ఆవాలు చిటపటలాడిన తరువాత, కారప్పొడి, మెంతి గుండ వేసి  ఆ వేడి నూనెని ఆపిల్ ముక్కల మీద వేసుకొని కలుపుకోండి. గ్రీన్ ఆపిల్స్ కొద్దిగా పుల్లగాను తీయగాను వుంటాయి.  ఈ పచ్చడి ముక్కలు చాలా బాగుంటాయి.


పనసపొట్టు మామిడికాయ కోరు పచ్చడి



కావలసినవి:


పనసపొట్టు :  250 gms మామిడికాయ : 1
కారం : 1 ½  స్పూన్   (మీరు ఎక్కువ కారం అలవాటు వుంటే ఎక్కువ వేసుకోవచ్చు)పసుపు:1/4 స్పూన్ఉప్పు : తగినంతమెంతిపొడి : ½ స్పూన్నునె : 5 స్పూన్స్
పోపుకి : ఆవాలు ½ స్పూన్, చిటికెడు ఇంగువ, రెండు ఎండుమిరపకాయలు.


విధానం :

మామిడికాయ చెక్కు తీసి తురుముకోవాలి.  ఒక పెనంలో 4 స్పూన్ల నూనె వేసి కొద్దిగా వెడిఎక్కిన తరువాత మామిడి కోరు, పనపొట్టు వేసి కలిపి పైన మూత పెట్టి ఒక 3 నిమిషాల తరువాత పసుపు, ఉప్పు వేసి కలిపండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకో 2 నిమిషాల తరువాత ఎండుమిరపపొడి మరియు మెంతిపొడి వేసి కలిపి ఇంకో రెండు నిముషాలు వుంచి దించెయ్యండి.  ఇప్పుడు ఒక చిన్న పోపు మూకుడులో ఒక స్పూన్ నునే వేసి అందులో ఆవాలు, ఇంగువ మరియు రెండు ఎండుమిరపకాయలు వేసి, ఆవాలు చిటపటలాడగానే, మామిడి పనస కోరులో వేసి కలుపుకోండి.  ఇది అన్నంలోకి, దోసలతో, చపాతీ లోకి కూడా బాగుంటుంది.


Tuesday, October 29, 2013

వంకాయ అల్లం కారము



వంకాయ అల్లం కారము:

కావల్సినవి :

వంకాయలు : 5
అల్లం : 3 ఇంచులు
పచ్చి మిర్చీలు : 3
జీర కర్ర : 1/2 స్పూన్
కొత్తిమీర : సగం కట్ట

విధానము :

ముందుగా అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీర మెత్తగా ఉప్పు వేసుకొని రుబ్బుకొని వంకాయలు నిలువుగ కొంచం, అడ్డంగా కొంచం చీల్చుకొని అందులో ఈ ముద్దని ఉంచుకొని బాణళిలో  కాస్త నూనె వేసి, ఆ నూనే కాస్త వేడెక్కాక ఈ ముక్కలు వేసి ఆ బాణలి పైన నీళ్ళ కంచం ఉంచుకొని బాగా ఉడికేవరకు ఉంచుకోవాలి. మద్యమద్యలో కలుపుకొంటూ మాడకుండా చూసుకొంటే వంకాయ అల్లం కారం రెడి.  

Friday, November 30, 2012

అరటిపువ్వు పప్పు కూర



కావల్సినవి: 

అరటిపువ్వు : ఒకటి
కంది పప్పు : ఒక కప్పు
శనగ పప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
ఆవాలు : చిటికెడు
కరివేపాకు : ఒక రబ్బ
పచ్చి మిర్చి : రెండు 


ముందుగా అరటిపువ్వును వెన్నులు తీసుకొని సన్నగా తరుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పు ఎర్రగా వేయించుకొని అందులో నీరుపోసి బద్ద బద్దగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ శనగ పప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక అందులో పచిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇంగువ వేసుకొని అందులో ఈ అరటి పువ్వు తురుమును వేసి నీళ్ళ కంచము మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ( పోపు మెత్తబడకూడదనుకునే వారు పొపు తీసి పక్కన పెట్టుకొని చివర్లో కలుపుకోవచ్చు). అరటిపువ్వు ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పును వేసుకొని (కాస్త ఉప్పు కావలంటే వేసుకోవచ్చు)కలుపుకొని రెండు నిమిషాలు  స్టవ్ మీద ఉంచి దింపేసేయండి. అంతే అరటిపువ్వు పప్పు కూర తయ్యారు. అందులో చల్ల మెరపకాయాలు నచుకొని తింటే బాగుంటుంది.  

Sunday, November 18, 2012

చనా గోబీ ఫ్రై



కావల్సినవి: 

గోబి ముక్కలు : ఒక కప్పు 
కాబూలీ చన : ఒక కప్పు 
జీర : ఒక స్పూన్ 
పచ్చి మిర్చీలు : 3-4 
ఉల్లిపాయలు: 2-3 
కరివేపాకు : రెండు రబ్బలు 
జీర పొడి : ఒక స్పూన్ 
నిమ్మరసం : 2-3 స్పూన్లు 
కొత్తి మీరి తురుము : ఒక స్పూన్ 

విధానం :

ముందుగా కాబూలి చన ఆరు గంటలు పసుపు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. నానిన చన ఉడికించుకొని పక్కనపెట్టుకోండి. కాళీఫవర్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో జీర వేసుకొని అది వేగాక అందులో పచి మిర్చి, కరివేపాకు వేసుకొని అది కాస్త వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి వేగుతూ ఉండగా అందులొ చిటికెడు పసుపు వేసుకొని అది బాగా వేగాక అందులో ముందుగా ఉడికించుకొన్న చన, కాలీఫవర్ ముక్కలు వేసుకొని అందులో ఉప్పు, జీర పొడి వేసుకొని ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకొని పైన కొత్తిమీరి తురుము వేసుకొని కలుపుకోవాలి. అంతే గోబీ చన మసాల రెడీ.

శనగల పాటోళీ



కావలసిన వస్తువులు

శనగలు -2 కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిర్చి-4- 6(కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని మిర్చి వేసుకోవచ్చు)
ఉల్లిపాయ - 2 పెద్దవి
ఎండు మిరపకాయలు - 2
శనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - ఒక కప్పు

తయారుచేసే విధానం:

ముందుగా శనగలు ఆరుగంటలు నానపెట్టుకోవాలి, నానిన శనగలతో పాటు ఒక చిన్న అల్లం ముక్క,పచ్చి మిరపకాయలు వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బాణలీలో కొంచెం నూనే వేసుకుని అందులో ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలపేస్ట్ ని వేసి సన్నటి సెగ మీద వుడికించుకోవాలి. మద్య మద్యలో కలుపుతూ బాణలీ అడుగున అంటుకోకుండా కొంచెం పొడిగా అయ్యేవరకు చూసుకోవాలి. అంతే, వేడి వేడి పాటోళీ రెడి, దీనికి మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్.

అలాగే 
నగపప్పుతో కూడా చేశుకోవచ్చు. నగపప్పు ఒక గంట నానితే చాలు.