వంకాయ అల్లం కారము:
కావల్సినవి :
వంకాయలు : 5
అల్లం : 3 ఇంచులు
పచ్చి మిర్చీలు : 3
జీర కర్ర : 1/2 స్పూన్
కొత్తిమీర : సగం కట్ట
విధానము :
ముందుగా అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీర మెత్తగా ఉప్పు వేసుకొని రుబ్బుకొని వంకాయలు నిలువుగ కొంచం, అడ్డంగా కొంచం చీల్చుకొని అందులో ఈ ముద్దని ఉంచుకొని బాణళిలో కాస్త నూనె వేసి, ఆ నూనే కాస్త వేడెక్కాక ఈ ముక్కలు వేసి ఆ బాణలి పైన నీళ్ళ కంచం ఉంచుకొని బాగా ఉడికేవరకు ఉంచుకోవాలి. మద్యమద్యలో కలుపుకొంటూ మాడకుండా చూసుకొంటే వంకాయ అల్లం కారం రెడి.